ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఇంటి స్థలాలను ఇతరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు' - plots owners protest at Guntur

తమ ఇంటి స్థలాలను వేరేవాళ్లకు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని గుంటూరులోని నల్లపాడు వద్ద అనసూయాంబనగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు పట్టణంలోని ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.

plots owners protest at Guntur
మా ఇంటి స్థలాలను ఇతరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు

By

Published : Jan 31, 2021, 3:28 PM IST

గుంటూరులోని నల్లపాడు వద్ద అనసూయాంబనగర్ కాలనీవాసులు.. నరసరావుపేట, సత్తెనపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. తమ ఇంటి స్థలాలను వేరేవాళ్లకు కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఈ ప్లాట్లను కొన్నామని.. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఈ ప్లాట్లను 30ఏళ్ల క్రితం కొనుక్కున్నాం. కొందరు ఇళ్లు నిర్మించుకోని ఇంటిపన్నులు, కరెంటు బిల్లులు కూడా కడుతున్నారు. అయితే తాజాగా వేరేవాళ్లకు ఈ స్థలాలను మార్పిడి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు.. ఈ స్థలాల హక్కుపత్రాల గురించి ఎలాంటి విచారణ చేపట్టకుండానే కొందరికి ఆన్​లైన్​లో 1బీ, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి. - బాధితులు

ABOUT THE AUTHOR

...view details