ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ విషవాయువు బాధితులను ఆదుకోండి' - 'విశాఖ విషవాయువు బాధితులను ఆదుకోండి'

విశాఖ గ్యాస్ ప్రమాదంలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొచ్చి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

By

Published : May 7, 2020, 5:09 PM IST

విశాఖ విషవాయువు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా బాధ్యులు డాక్టర్ అరవింద బాబు డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై స్పందించిన ఆయన... అమాయకులు, అభంశుభం తెలియని చిన్నారులు నిద్రలోనే మృతిచెందడం బాధ కలిగించిందన్నారు.

ఘటలో మృతిచెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొచ్చి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details