ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suryalanka: సూర్యలంకలో మినీ ఎయిర్​పోర్టు నిర్మాణానికి వాయుసేన ప్రయత్నాలు

Plan for Mini Airport at Suryalanka: గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సమీపంలో మినీ విమానాశ్రయాన్ని నిర్మించాలని వాయుసేన భావిస్తోంది. ఇందుకోసం 300 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక వాయుసేన అధికారులు కోరారు. తూర్పుతీరం సూర్యలంకలో ఇప్పటికే వాయుసేన కేంద్రం ఉండగా.. 300 ఎకరాల్లో రన్ వే నిర్మిస్తే యుద్ధ విమానాలతోపాటు చిన్న విమానాలు సైతం ఆగటానికి అవకాశముందని అధికారులు అంటున్నారు.

Mini Airport In Suryalanka
సూర్యలంక సమీపంలో మినీ విమానాశ్రయం

By

Published : Jan 31, 2022, 8:47 PM IST

Updated : Feb 1, 2022, 12:05 AM IST

Air Force plan to Mini Airport at Suryalanka: గుంటూరు జిల్లా సూర్యలంకలో వాయుసేనకు ఏకైక క్షిపణి పరీక్షా కేంద్రం ఉంది. ఏటా డిసెంబరు నుంచి మార్చి వరకు ఆకాశ్ సహా పలు క్షిపణుల్ని తీసుకొచ్చి అక్కడ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కృష్ణలంక వాయు సేన కేంద్రం 1500 ఎకరాల్లో ఉంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ కేంద్రాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. యుద్ధవిమానాలు దిగటానికి రన్ వే నిర్మాణం, ఇతర అవసరాల కోసం సూర్యలంకలో 3 వేల ఎకరాలు అవసరమని 2017లో ప్రతిపాదించారు. దీనిపై పరిశీలన జరిపిన అధికారులు.. సూర్యలంక, పేరలి అటవీప్రాంతంలో భూములు కేటాయించాలని భావించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

అయితే.. తర్వాత ఈ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. సూర్యలంకలో ఆధునిక యుద్ధవిమానాలతో ఎయిర్ బేస్ నిర్మించాలన్న ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాయుసేన విభాగానికి అనుకుని ఉన్న 300 ఎకరాల అటవీ భూములను యుద్ధ విమానాలు దిగేలా రన్ వే నిర్మాణానికి కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖను వైమానిక దళ అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి అటవీశాఖ పరిధిలో ఉన్నందున అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

1800 నుంచి 2400 మీటర్ల రన్ వే..!

రక్షణ అవసరాల రీత్యా అటవీ భూములను కేటాయించడానికి కేంద్రం సైతం సముఖంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ భూమి అందుబాటులోకి వస్తే 1800 నుంచి 2400 మీటర్ల పొడవునా రన్ వే నిర్మించాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. యుద్ధ విమానాలు, సైనిక హెలీకాప్టర్లు, చిన్న, మధ్య తరహా విమానాలు దిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు భూసేకరణ పనిలో పడ్డారు వాయు సేన అధికారులు.

ఇదీ చదవండి

Botsa On PRC: కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స

Last Updated : Feb 1, 2022, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details