ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలి: హైకోర్టులో పిల్ - polavaram latest news

పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని హైకోర్టులో పిల్
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని హైకోర్టులో పిల్

By

Published : Jan 31, 2021, 3:19 PM IST

పోలవరం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు ఆర్​ఆండ్​ఆర్, భూసేకరణ చట్టం-2013 ప్రకారం బాధితులందరికి సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ... గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని పిటిషన్​లో పేర్కొన్నారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం అవసరమైన నిధులు సమకూర్చడానికి కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపినా... కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం తెలపాలని పిటిషన్​లో కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి...

అడకత్తెరలోపోకచెక్క.. పురపాలికల్లో విలీన గ్రామాల తీరిది

ABOUT THE AUTHOR

...view details