ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విదేశీ విద్యాదీవెన పథకం నిలిపివేయటంపై హైకోర్టులో వాదనలు - విదేశీ విద్యాదీవెన పథకం నిలిపివేయటంపై హైకోర్టులో వ్యాజ్యం లేటెస్ట్ న్యూస్

విదేశీ విద్యాదీవెన పథకం నిలిపివేయటంపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. అయితే.. విదేశీ విద్యాదీవెనకు సంబంధించి త్వరలోనే తీపికబురు వస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. జూన్ 23లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

విదేశీ విద్యాదీవెన పథకం నిలిపివేయటంపై హైకోర్టులో వ్యాజ్యం
విదేశీ విద్యాదీవెన పథకం నిలిపివేయటంపై హైకోర్టులో వ్యాజ్యం

By

Published : Apr 21, 2022, 6:01 PM IST

విదేశీ విద్యాదీవెన పథకం నిలిపివేయటంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విదేశీ విద్యాదీవెనకు సంబంధించి త్వరలోనే తీపికబురు వస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై విచారణ అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.

ఈ పథకానికి ఎంపికై ఇప్పటికే విదేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్లు వాదించారు. ప్రభుత్వం ఏంచేస్తుందో చెప్పేందుకు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జూన్ 23లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి: CBN Warns Leaders: 'పని చేయకుండా.. మాయ చేసే నేతలకు చెక్​'

ABOUT THE AUTHOR

...view details