విజయవాడ నుంచి గుంటూరు వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కాగా... వీరిని అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ నుంచి ఇంధనం లీకై వృథాగా పోయింది. ఈ ఘటన గుంటూరు నగర శివారు బుడంపాడు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి... ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా... ఇద్దరికి గాయాలు - గుంటూరు జిల్లా తాజా ప్రమాదం వార్తలు
గుంటూరు నగర శివారు బుడంపాడు జాతీయ రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వీరిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెట్రోల్ ట్యాంకర్ బోల్తా