ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ - విద్యుత్‌ కంపెనీల పిటిషన్

పీపీఏల అంశంలో విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై హైకోర్టులో ఈనెల 22న విచారణ జరగనుంది. విద్యుత్‌ కొనుగోలును ప్రభుత్వం నిలిపివేసిందంటూ పవన, సౌర విద్యుత్ కంపెనీలు పిటిషన్‌ దాఖలు చేశాయి.

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ

By

Published : Aug 1, 2019, 7:24 PM IST

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ

పీపీఏల నిలిపివేతపై హైకోర్టులో మరో రెండు విద్యుత్‌ కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. సౌర, పవన విద్యుత్‌ కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోళ్లు ఆపివేసిందని హైకోర్టును పలు సంస్థలు ఆశ్రయించాయి. ఈ నెల 22న వీటి అనుబంధ పిటిషన్లు ఉన్నాయన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది... వాటితో పాటు ఈ రెండు పిటిషన్ల విచారించాలని కోరారు. సమ్మతించిన న్యాయస్థానం... పీపీఏలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఈ నెల 22న విచారణ చేస్తామని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details