MP Raghuramakrishnam Raju: కస్టడీలో తనను సీఐడీ సిబ్బంది చిత్రహింసలు పెట్టారని.. ఆ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రజా ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై.. మీడియా, బహిరంగ సమావేశాల్లో మాట్లాడినందుకే కేసు నమోదు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు పిటిషనర్‌పై కక్ష కట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి హైకోర్టు నోటీసులు
MP Raghuramakrishnam Raju: తనను కస్టడీలో సీఐడీ అధికారులు చిత్రహింసలు పెట్టారని.. ఆ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐని ఆదేశించింది.
MP Raghuramakrishnam Raju
Last Updated : Feb 8, 2023, 10:58 PM IST