High Court On Kapu reservation : కాపులకు 5% రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు కేటాయిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రిని ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలుపుతూ నంబరు కేటాయించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందన్‌రావు విచారణ జరిపారు.
ముఖ్యమంత్రిని ప్రతివాదుల జాబితాలో చేర్చలేము : హైకోర్టు - reservation to Kapu
Kapu Reservation : కాపులకు రిజర్వేషన్ కల్పించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వాదపోవాదనలు జరిగాయి. దీనిలో గత ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ కోసం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.
కాపులకు రిజర్వేషన్ కల్పించే వ్యవహారాన్ని వైసీపీ మ్యానిఫెస్టోలో పెట్టిందని పిటీషనర్ న్యాయవాది రాధాకృష్ణ వాదనలు వినిపించారు. ప్రస్తుతం మాత్రం వైసీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ జీవో తీసుకొచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నామని తెలపగా.. మ్యానిఫెస్టో అంశాల అమలుకు న్యాయస్థానాలు ఆదేశించలేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. దాంతో సీఎం పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఆ వివరణను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యాజ్యానికి నంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. మంగళవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది.
ఇవీ చదవండి :