ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వం జీవోలను గోప్యంగా ఉంచుతోందని హైకోర్టులో పిటిషన్‌

High court G.O: రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను రహస్యంగా ఉంచుతోందని న్యాయవాది శ్రీకాంత్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాసంబంధ వ్యవహారంతో ముడిపడిఉన్న జీవోలను గోప్యంగా ఉంచుతోందని ఆయన అన్నారు. ఇదే అంశంపై మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.

By

Published : Nov 17, 2022, 12:52 PM IST

AP HIGH COURT
AP HIGH COURT

High court G.O: రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను రహస్యంగా ఉంచుతోందని న్యాయవాది శ్రీకాంత్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాసంబంధ వ్యవహారంతో ముడిపడిఉన్న జీవోలను గోప్యంగా ఉంచుతోందన్నారు. గతంతో పోల్చిచూస్తే కేవలం 10 శాతం జీవోలను మాత్రమే బహిర్గతం చేస్తోందని... ఇది సమాచార హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించి... జీవోలన్నింటిని అప్‌లోడ్‌ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. జీవోల విషయంలో తాజా వివరాలను సేకరించేందుకు 2 వారాల సమయం కావాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోరడంతో....... అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. జీవోలను వెబ్‌సైట్లో ఉంచడకపోవడాన్ని సవాలు చేస్తూ.. దేవి, చెన్నుపాటి సింగయ్య........ మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details