పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టుపై నవయుగ ఇంజినీరింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఏపీ జెన్కో హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొంది. పీహెచ్పీ విషయంలో బ్యాంక్ పూచీకత్తుల అంశంపై మధ్యవర్తిత్వ క్లాజును అనుసరించి నవయుగ సంస్థ.. దిగువ కోర్టును ఆశ్రయించిందని పిటిషన్లో గుర్తు చేసింది. ఏపీ జెన్కో దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి..హైకోర్టులో ఏపీజెన్కో పిటిషన్ - Petition
నవయుగ ఇంజినీరింగ్ సంస్థతో చేసుకున్న ఒప్పంద రద్దుకై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఏపీ జెన్కో హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది.
మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి..హైకోర్టుల ఏపీజెన్కో పిటిషన్