High Court: గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ - గుంటూరు జడ్పీ ఛైర్మన్ క్రిస్టినాపై హైకోర్టులో పిటిషన్

13:00 September 27
Guntur ZP Chairman
గుంటూరు జడ్పీ ఛైర్మన్ క్రిస్టీనా, ఆమె భర్తకు చెందిన ఎస్సీ కులధ్రువీకరణ పత్రం రద్దు కోరుతూ చేసిన విన్నపాన్ని కలెక్టర్ తిరస్కరించడంపై.. కొల్లిపర వాసి సరళకుమారి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం.. క్రిస్టినా, ఆమె భర్త సహా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ తరఫున వాదించిన శ్రావణ్‌కుమార్.. క్రిస్టినా, ఆమె భర్త ఎస్సీలు కాదని..క్రైస్తవంలోకి మారినందున రిజర్వేషన్ వర్తించదన్నారు. వారు క్రిస్టియన్లు అని చెప్పేందుకు పలు సాక్ష్యాలున్నాయన్నారు. క్రిస్టినా ఎస్సీ కాకపోయినా.. వారికి రిజర్వ్ చేసిన స్థానంలోనే జడ్పీటీసీ ఎన్నికల్లో బరిలోకి దిగారని వాదించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని.. పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: