కరోనా లాక్డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయించాలని.. గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అర్బన్, గ్రామీణ ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. గుంటూరు బార్ అసోషియేషన్ అధ్యక్షులు చిలుకూరి నరేంద్రబాబు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయసేవాధికార సంస్థ విచారణకు స్వీకరించింది.
సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయాలని పిటిషన్ - గుంటూరు లోక్ అదాలత్‌లో సీజ్ చేసిన వాహనాలపై వ్యాజ్యం
లాక్డౌన్ వేళ పోలీసుల సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయించాలని కోరుతూ.. ఇద్దరు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ విచారణకు స్వీకరించింది.
![సీజ్ చేసిన వాహనాలు విడుదల చేయాలని పిటిషన్ petetion in lokadalat on seized vehicles in lockdown in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7313672-852-7313672-1590214395316.jpg)
లాక్ డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు
లాక్ డౌన్‌పై ముందుస్తు సమాచారం లేక రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని... వాటిని రక్షణ లేకుండా మైదానాల్లో ఉంచారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో వాహనాలు తుప్పుపట్టి పాడైపోతున్నాయని వివరించారు. ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
ఇవీ చదవండి.... రేపటి నుంచి మంగళగిరిలో లాక్ డౌన్ సడలింపులు