Personal Data Theft in AP: రాష్ట్రంలోని ఓటర్ల సమాచారమంతా వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఉందా అంటే అవుననే అనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ మంత్రి విడదల రజని పేరిట మెసేజ్‌లు రావడమే దానికి నిదర్శనం. రజని గుంటూరులో అడుగుపెట్టి నెల రోజులు కాక ముందే ఓటర్లందరి ఫోన్ నెంబర్లుకు సందేశాలు ఎలా పంపగలిగారనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల వ్యక్తిగత వివరాలు అధికార పార్టీ నేతల వద్ద ఉన్నాయన్న పవన్ కల్యాణ్ ఆరోపణలు నిజమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
దుర్వినియోగానికి అస్కారముందన్న జనసేనాని : రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారమంతా వాలంటీర్లు ద్వారా సేకరించి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చారని గతంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గతంలో ఆరోపించారు. ప్రజల డేటాను దుర్వినియోగం చేసేందుకు ఆస్కారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ సహా పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ension in Rajini Tour: మైలవరంలో మంత్రి రజినిని అడ్డుకునేందుకు స్థానికుల యత్నం.. ఉద్రిక్తత
పవన్ ఆరోపణలు నిజమనే తీరుగా : అధికార పార్టీ నేతలు మాత్రం పవన్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అయితే తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మంత్రి విడదల రజని పేరిట ఓటర్లందరికీ మెసేజ్‌లు వచ్చాయి. చిలకలూరి పేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారిన రజని ఇక్కడి ఓటర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపించారు. దీంతో పవన్ చేసిన ఆరోపణలకు నిజమేనని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.