గుంటూరు జిల్లా నరసరావుపేటలో వ్యక్తి హత్య కలకలం రేపింది. పట్టణంలోని శ్రీరాంపురం మసీదు వద్ద ఆదివారం రాత్రి ఇంటిబయట నిద్రించిన గడ్డం బాజి అనే వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మృతుడు మద్యం మత్తులో ఉండి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు పాత కక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు బాజి మొదటి భార్యతో విడిపోయి కొంతకాలంగా మరో మహిళతో కలిసి ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.
అర్ధరాత్రి వ్యక్తి హత్య.. ఏమై ఉంటుంది? - నరసరావుపేట
రాత్రి ఆరుబయట పడుకుని నిద్రపోయిన వ్యక్తి తెల్లవారేసరికి శవమై కనిపించిన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. బాజి అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
అర్ధరాత్రి వ్యక్తి హత్య.. ఏమై ఉంటుంది?