ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అచంపేట్ మండలం కొండూరుకి చెందిన మాది సురేష్... తన తండ్రి రాజారావుకు ఆరోగ్యం బాగా లేదని మందులు తెచ్చేందుకు ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్ళాడు. తిరుగి ఇంటికి వస్తుండగా... తాడికొండ మండలం లాం అడ్డ రోడ్ వద్ద ద్విచక్ర వాహనం ఒక్క సారిగా అదుపుతప్పడంతో పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టాడు. ప్రమాదంలో గాయపడిన సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడికొండ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అదుపుతప్పి చెట్టుని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి - లాం అడ్డురోడ్డు వద్ద ప్రమాదం తాజా వార్తలు
తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని... మందులు తెచ్చేందుకు ద్విచక్రవాహంపై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు తాడికొండ మండలం అడ్డరోడ్ వద్ద జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన కొండూరు గ్రామస్థుడు సురేష్