ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవవల్లి గ్రామ సమీపంలో జరిగింది. మరణించిన వ్యక్తి అడవులదివి గ్రామానికి చెందిన పెనుముడి సురేష్ బాబు(33)గా స్థానికులు గుర్తించారు. ఓ పని మీద గురువారం సాయంత్రం ఊలుపాలెం వచ్చాడు. అనంతరం పని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా అరవపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం వల్ల రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సురేష్ బాబు మృతి చెందాడు. ఘటనపై పట్టణ ఎస్సై చాణిక్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ద్విచక్రవాహనం పైనుంచి పడి వ్యక్తి మృతి - guntur district latest news
ద్విచక్రవాహనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా అరవవల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనపై పట్టణ ఎస్సై కేసు నమోదు చేశారు.

ద్విచక్రవాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి