తల్లిదండ్రులిద్దరూ 3 నెలల వ్యవధిలో చనిపోయి.. వారి పిల్లలు అనాథలైన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. పట్టణంలోని రత్నాల చెరువుకు చెందిన అనిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని భార్య అనారోగ్యంతో 3 నెలల క్రితం మృతిచెందింది. అప్పట్నుంచి అనిల్ వారిని చూసుకుంటున్నాడు. అయితే బుధవారం రాత్రి అనిల్ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తండ్రి మృతదేహం వద్ద దీనంగా కూర్చున్న చిన్నారుల్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
విద్యుదాఘాతంతో తండ్రి మృతి.. అనాథలైన ఇద్దరు చిన్నారులు - మంగళగిరిలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి వార్తలు
తల్లి 3 నెలల క్రితం అనారోగ్యంతో కన్నుమూసింది. తండ్రి ఇప్పుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. విగత జీవిగా పడిఉన్న నాన్న ముందు కూర్చుని దీనంగా చూస్తున్న పిల్లలను చూసి అందరూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది.
విద్యుదాఘాతంతో తండ్రి మృతి.. అనాథలైన ఇద్దరు చిన్నారులు