ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి - చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

person died with accident in chilakaluripet guntur district
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

By

Published : Jun 7, 2020, 8:11 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మరణించాడు. మురికిపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు కిరాణా దుకాణం నిర్వహించేవాడు. సరకుల కోసం చిలకలూరిపేటకు వెళ్లి బైక్​పై తిరుగు ప్రయాణంలో ఉండగా.. ట్రాక్టర్ అదుపుతప్పి అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సాంబశివరావుకు తీవ్ర గాయాలయ్యాయి.

అతనికి చిలకలూరిపేట ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details