తాడేపల్లి వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన జయబాబు, అతని స్నేహితులు కృష్ణానదిలోకి స్నానానికి దిగారు. కాసేపటికే జయబాబు నీట మునగటంతో.. గమనించిన స్థానికులు, స్నేహితులు బయటకు తీశారు. తీవ్ర అస్వస్థతకు గురవటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జయబాబు మృతి చెందాడు.
కృష్ణానదిలో మునిగి యువకుడు మృతి - తాడేపల్లి తాజా వార్తలు
స్నానం చేసేందుకు కృష్ణానదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద జరిగింది.

స్నానం కోసం నదిలోకి దిగి మృతి చెందిన యువకుడు