క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకొని పురుగుమందు తాగి మృతి చెందిన ఊర సురేష్ అంతక్రియలు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగాయి. మరో మిత్రునితో కలిసి అతడు ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిస కాగా.. దాదాపు లక్ష రూపాయల వరకు ఇరువురూ అప్పుల పాలయ్యారు. డబ్బుల కోసం బెట్టింగ్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు.
బెట్టింగ్‌కు బలైన సురేష్ అంత్యక్రియలు పూర్తి - గుంటూరులో ఐపీఎల్ బెట్టింగ్ వల్ల మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు
ఐపీఎల్ బెట్టింగ్.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఊర సురేష్.. పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి స్వగ్రామంలో ఈ రోజు అంత్యక్రియలు జరిగాయి. మరొకరు చికిత్స పొందుతున్నారు.
![బెట్టింగ్‌కు బలైన సురేష్ అంత్యక్రియలు పూర్తి ipl betting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9513387-209-9513387-1605098491982.jpg)
ఐపీఎల్ బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి అంత్యక్రియలు
పేరేచర్లలోని బేడ బుడగ జంగాల కాలనీలో చిలక జోస్యం చెబుతూ సురేష్ జీవిస్తుండేవాడు. ఏడాది క్రితం రాణి అనే మహిళతో వివాహం అయింది. ఊహించని ఈ ఘటనతో.. అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అరెస్ట్