ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపా కార్యకర్తల వల్లే మద్యం దుకాణాల వద్ద రద్దీ' - తెదేపాపై మంత్రి పేర్ని నాని విమర్శలు

తెదేపాపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మద్యం దుకాణాల వద్ద రద్దీకి తెలుగుదేశమే కారణమని ఆరోపించారు. మద్యం దుకాణాలకు దేశవ్యాప్తంగా కేంద్రమే మినహాయింపు ఇచ్చిందని వెల్లడించిన మంత్రి... ప్రధాని మోదీపై ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.

perni nani
perni nani

By

Published : May 5, 2020, 6:38 PM IST

Updated : May 5, 2020, 7:14 PM IST

మీడియాతో మంత్రి పేర్ని నాని

తెలుగుదేశం పార్టీ... తన కార్యకర్తలకు డబ్బులిచ్చి మద్యం దుకాణాల వద్ద క్యూలలోకి పంపుతోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వారే భౌతికదూరం పాటించకుండా, మాస్కులు లేకుండా గందరగోళం చేస్తున్నారని అన్నారు. తెదేపా క్షుద్ర రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన మంత్రి... బ్రాందీ షాపులు తీయమన్నది ప్రధాని మోదీనే అని అన్నారు. ప్రధానిపై ఎందుకు విమర్శలు చేయలేకపోతున్నారని తెదేపాను ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు, మోదీకి ప్రేమ సందేశం పంపడానికే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పని తీరును పక్క రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారని అన్నారు.
మరోవైపు మద్యం దుకాణాలు వద్ద ఉపాధ్యాయల విధులు వివాదంపైనా ఆయన స్పందించారు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచలేదని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో వారే స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే సరిదిద్దుతామన్నారు.

Last Updated : May 5, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details