చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు రవాణా చేస్తున్న టమాటాల నాణ్యత తగ్గుతోంది. రవాణా సమయంలో అధికారుల తనిఖీలు, ఆంక్షలతో జిల్లాకు రావడానికి ఆలస్యమవుతోంది. గుంటూరు నగరంతో పాటు తెనాలి పట్టణాల్లోని రైతుబజార్లకు తరలించిన టమాటాలు కొంతమేర పాడవ్వడంతో.. వ్యాపారులు వాటిని పారబోశారు. ఒక్కో ట్రేలో సుమారు 5 నుంచి 8 కేజీల వరకు దెబ్బతిన్నాయని విక్రయదారులు వాపోతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని, రవాణాలో ఆంక్షలు సడలించాలని వ్యాపారులు కోరుతున్నారు.
రవాణా ఆంక్షలతో పాడవుతున్న టమాటాలు - గుంటూరు జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వస్తున్న టమాటాల్లో నాణ్యత లోపిస్తుంది. రవాణా సమయంలో నిబంధనలు, అధికారుల ఆంక్షలతో సరకు పాడవుతోంది. ఫలితంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రవాణా ఆంక్షలతో పాడవుతున్న టమాటాలు