ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​కు ఎందుకు ఓటు వేశామని.. ప్రజల్లో ఆత్మవిమర్శ' - జగన్​కు ఓటువేసి... తప్పుచేశామని ప్రజలు అనుకుంటున్నారా?

జగన్ పరిపాలన మూడు నెలలకే మాడి మసైపోయిందని టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

By

Published : Aug 27, 2019, 11:24 PM IST

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జగన్‌ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతున్నాడని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీని బట్టి బహిర్గతమవుతుందన్నారు. జగన్ పరిపాలన 90 రోజులకే మాడి మసైపోయిందని... రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని విమర్శించారు. జగన్‌కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులన్నీ వెనక్కిపోతున్నాయన్నారు. పోలవరంపై కోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా రివర్స్ టెండరింగ్ అనే ఎందుకు తపిస్తున్నారని ప్రశ్నించారు. నీతివాక్యాలు చెప్తున్న వ్యక్తి చరిత్ర అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల ప్రజలు సీఎం ఇంటి వద్ద రోజూ ధర్నాలు చేసే దౌర్భాగ్యం తెచ్చారని మండిపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details