ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

People Suffer With Power Cut in Villages: అంధకారంలో వేల గ్రామాలు.. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ఆందోళన - విద్యుత్‌ కోతలతో అవస్థలు

People Suffer With Power Cut in Villages: అప్రకటిత విద్యుత్‌ కోతలు గ్రామీణ ప్రజలకు చుక్కలుచూపిస్తున్నాయి. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో విధిస్తున్న కోతల వల్ల బుధవారం సాయంత్రం నుంచి వేల గ్రామాల్లో అంధకారం అలముకుంది. వీటీపీఎస్, కృష్ణపట్నంతో పాటు.. ఆర్‌టీపీపీలోని 2 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కరెంటు కోతలు తట్టుకోలేక జనం రోడ్డెక్కాల్సి వచ్చింది. సాధారణంగా వేసవిలో విధించే కరెంటు కోతలు వర్షాకాలంలో పెట్టడం ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 10, 2023, 8:11 AM IST

Updated : Aug 10, 2023, 11:07 AM IST

People Suffer With Power Cut in Villages: అంధకారంలో వేల గ్రామాలు

People Suffer With Power Cut in Villages :రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలతో జనం అల్లాడుతున్నారు. బుధవారం వేలాది గ్రామాలు కరెంటు లేక చీకట్లలో మగ్గాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యవసరలోడ్‌ రిలీఫ్‌ పేరిట విద్యుత్ కోతలు విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి చాలా పల్లెల్లో కరెంటు లేదు. ఉక్కపోత, దోమల మోతతో జనం నిద్రలేకుండా గడిపారు. మండల కేంద్రాల్లో సైతం సరఫరా నిలిచింది. స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నుంచి వచ్చే సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని ఉపకేంద్రాల వారీగా కోతలు అమలు చేస్తున్నారు. దీనిపై జనం ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నా కోతలు విధించడం ఏంటని మండిపడ్డారు.

People Suffer With Power Cut in Villages :గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనం సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. వాహనాలు నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రాజధాని ప్రాంతం రాయపూడిలో విద్యుత్తు లేకపోవడంతో ఉపకేంద్రం వద్దకు వెళ్లి స్థానికులు ఆందోళన చేశారు. దుగ్గిరాల మండలం పెదపాలెం విద్యుత్ సబ్ స్టేషన్‌నూ ప్రజలు ముట్టడించారు.

power cut in area Hospital: అంధకారంలో నర్సాపురం ఏరియా ఆసుపత్రి.. అల్లాడిపోయిన రోగులు
Many Villages Plunge into Darkness in State : పల్నాడు జిల్లాలో మద్దిరాల, పోతవరం గ్రామాల ప్రజలు చిలకలూరిపేట-కోటప్పకొండ రహదారిపై విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా రాత్రి రాస్తారోకో చేశారు. రాత్రి 7 గంటలకు పోయిన కరెంటు 11 గంటలు దాటినా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. కరెంటు ఇస్తేనే ఇళ్లకు వెళ్తామంటూ రోడ్డుపైనే బైఠాయించారు.

విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ఆందోళన : బాపట్ల జిల్లాలో చీరాల, పర్చూరు, వేటపాలెం,చినగంజాం, చెరుకుపల్లి, నిజాంపట్నంలోనూ కరెంటు కోతలు వేశారు. ముందెన్నడూ లేనంతగా కరెంటు బిల్లులు వసూలు చేస్తూ కోతలు విధించడం ఏంటని ప్రజలు ప్రశ్నించారు. అద్దంకి మండలం సాధుపురం, జె.పంగుళూరు విద్యుత్ ఉప కేంద్రాల వద్ద కోతల్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేశారు.

రాష్ట్రపతి మాట్లాడుతుండగా కరెంట్​ కట్​.. చీకట్లోనే ప్రసంగం.. 9 నిమిషాల పాటు..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు :శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో గంటల తరబడి విద్యుత్ నిలిపివేస్తే ఎలాగంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. దోమకాట్లతో పిల్లలు నిద్రపోవడం లేదని ఆక్రోశించారు. రొళ్ళ, రత్నగిరిలోని విద్యుత్ ఉప కేంద్రాల వద్ద రైతులు నిరసన తెలిపారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉపకేంద్రానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాగుకు 9 గంటల కరెంటు అని చెప్పి.. కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదని, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్విచ్ ఆఫ్ అయిన ఫోన్లు :నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని చేజర్ల, మర్రిపాడు, ఏఎస్ పేట మండలాల్లో కరెంటు కోతపై ప్రజలు మండిపడ్డారు. అధికారుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఎవరికి ఫోన్‌ చెయ్యాలో తెలియక అల్లాడారు.

Power Cut in Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ కోతలు.. నరకం చూస్తున్న రోగులు..

Last Updated : Aug 10, 2023, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details