గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో బొడ్డురాయి సెంటర్లో ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టును తగులబెట్టారు. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అర్థరాత్రి పూట ఈ ఘటనకు పాల్పడ్డారు. గ్రామస్థులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంతోకాలంగా కొలుచుకుంటున్న మహాలక్ష్మమ్మ చెట్టు తగులబడి పోవడంతో స్థానికులు కలత చెందారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టుకు నిప్పంటించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు గ్రామానికి చేరుకుని.. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్థరాత్రి చెట్టుకు నిప్పు.. పోలీసుల అదుపులో అనుమానితులు! - chadalavada aravind babu news
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో బొడ్డురాయి సెంటర్లో ఉండే మహాలక్ష్మమ్మ చెట్టు కాలిపోయింది. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు చెట్టుకు నిప్పటించటంతో ఘటన జరిగింది.
![అర్థరాత్రి చెట్టుకు నిప్పు.. పోలీసుల అదుపులో అనుమానితులు! People setting fire to a tree](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10821521-585-10821521-1614585778407.jpg)
అర్థరాత్రి చెట్టుకు నిప్పంటించిన వ్యక్తులు
అర్థరాత్రి చెట్టుకు నిప్పంటించిన వ్యక్తులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు