People Rejecting Cent Land : సీఎం జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ పాలెంలో రాజధాని అమరావతి పరిధిలో ఉన్న 50,793 మంది పేదలకు శుక్రవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతంలోని ఆర్5 జోన్‌లో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కానీ మరోవైపు ఆ ఇళ్ల పట్టాలు వద్దంటూ సీఎం సభకు వెళ్లకుండా, శని వారం ధర్నా నిర్వహించారు.
ప్రాణాలైన ఇస్తాం..సెంటు స్థలం తీసుకోము :గుంటూరు జిల్లా మంగళగిరి గండాలయ్య పేట వాసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంటు భూమి స్థలాలను గండాలయపేట వాసులు మూకుమ్మడిగా తిరస్కరించారు. తాము ఎన్నో దశాబ్దాలుగా ఈ మట్టితో కలసి ఉంటున్నామని, ఉన్న ఫళంగా ఖాళీ చేసి వెళ్లిపోమంటే వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణాలైనా ఇస్తామని, కానీ సెంటు స్థలాలు తీసుకోబోమని వారు స్పష్టం చేశారు.
Pothina Mahesh On Houses: 'సెంటు భూమి పేరుతో జగన్ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు'
సెంటు భూమి లేఅవుట్లలో ఎలాంటి సౌకర్యాలు లేవని, వర్షాలు వస్తే మోకాల్లోతు బురద ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నామన్నారు. ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు కలిసి ఉంటున్నామని, సెంటు తీసుకుంటే మిగిలిన వారంతా ఎక్కడుండాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గురువారం సాయంత్రం వాలంటీర్లు వచ్చి బస్సులు పెట్టి, శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభకు రావాలని చెప్పారు. తాము మూకుమ్మడిగా తిరస్కరించి, సీఎం కార్యక్రమానికి వెళ్లలేదన్నారు. కానీ వైఎస్సార్సీపీ నేతలు వారిని బలవంతంగా సీఎం కార్యక్రమానికి తరలించాలని చూశారనీ, వారి ప్రయత్నాలు ఫలించలేదన్నారు.