ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్19 ఆస్పత్రి ఏర్పాటును అడ్డుకున్న ప్రజలు - గుంటూరు జిల్లాలో కొవిడ్ ఆస్పత్రి ఏర్పాటును అడ్జుకున్న ప్రజలు

కరనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా కొవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు అత్యవసరమవుతోంది. అయితే పిడుగురాళ్లలో కొవిడ్ 19 ఆస్పత్రి ఏర్పాటును ఆ ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు.

people protest
people protest

By

Published : Jul 22, 2020, 5:46 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కొవిడ్ 19 ఆస్పత్రిని ప్రజలు నివసించే ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమంటూ.. స్థానికులు ఆందోళన చేపట్టారు. అనుమతి ఇచ్చింది ఒకచోట అయితే.. మరొక చోట ఆస్పత్రిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మార్వో, పట్టణ సీఐ సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. పైఅధికారులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆందోళనకారులకు సర్దిచెప్పి వెనక్కు పంపారు.

ABOUT THE AUTHOR

...view details