గుంటూరు నగరంలోని బ్రాడిపేట కంటైన్మెంట్ జోన్ వద్ద రాకపోకలు నిలిపివేయటంపై స్థానికుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అధికారులు కంటైన్మెంట్ గా గుర్తించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రించారు.
నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ నుంచి బయటకి రాకపోకలు సాగించరాదు. దీంతో శంకర్ విలాస్ కూడలి వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన పోలీసులు... బ్రాడిపేటలోకి వాహనాలు రాకపోకలు సాగించకుండా నియంత్రిస్తున్నారు.