గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో దళితులకు చెందిన ఫీల్డ్ లేబర్ కోపరేటివ్ సొసైటీ భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. కొందరు వైకాపా నేతలు, అధికారుల అండదండలతో నకిలీ పట్టాలు సృష్టించి ఇసుక తవ్వుతున్నారని స్థానికులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆక్రమణకు గురైన తమ భూములు కాపాడాలంటూ మహిళలు ఆందోళన చేశారు. తమ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు.
భూములను ఆక్రమిస్తున్నారంటూ రోడ్డెక్కిన దళితులు - అచ్చంపేటలో గ్రామస్థులు ధర్నా
తమ భూములను వైకాపా నేతలు ఆక్రమిస్తున్నారంటూ గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో దళితులు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని... వాటికి నకిలీ పట్టాలు సృష్టించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.
dharna