ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదమని తెలిసినా.. గమ్యం వేగంగా చేరాలని.. - railway crossing accidents news in guntur

కరోనా వ్యాప్తి నివారణకు గుంటూరులో లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణంలోని కంకర బ్రిడ్జిపైకి వాహనాలు అనుమతించకపోవడం వల్ల వాహనదారులు సమీపంలోని అనుమతి లేని రైల్వే ట్రాక్​లను ప్రమాదకరంగా దాటుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

ప్రమాదమని తెలిసినా.. గమ్యం వేగంగా చేరాలని..
ప్రమాదమని తెలిసినా.. గమ్యం వేగంగా చేరాలని..

By

Published : Apr 13, 2020, 8:32 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు గుంటూరు జిల్లాలో అధికార యంత్రాంగం లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు ఫ్లైఓవర్​పైకి వాహనాలు అనుమతించడం లేదు. ప్రధానంగా గుంటూరు కంకర బ్రిడ్జిపైకి వాహనాలను నిలిపివేయటంతో అటుగా వెళ్లే వాహనదారులు ప్రాణాలును సైతం లెక్కచేయకుండా అనుమతి లేని.. మూసి ఉన్న రైల్వే ట్రాక్​లను దాటుతున్నారు. గుంటూరు రెవెన్యూ భవన్ బ్రాడిపేట 14వ అడ్డురోడ్డును కలుపుతూ ఈ రైల్వే ట్రాక్ ఉంది. త్వరగా గమ్య స్థానానికి వెళ్లేందుకు ప్రజలు ఈ దారిలో వెళ్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details