ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనానికి నిబంధనలంటే లెక్కే లేదు.. కరోనాకు అడ్డే లేదు! - గుంటూరులో ట్రాఫిక్​ తాజా వార్తలు

గుంటూరులో కరోనా తీవ్ర రూపం దాల్చినప్పటికీ జనం మాత్రం నిబంధనలు పాటించడం లేదు. లాక్​డౌన్​ సడలింపులతో రోడ్లపైకి వస్తున్న జనం భౌతిక దూరం మరిచి కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు.

people croud in guntur roads
జనానికి నిబంధనల లెక్కలేదు

By

Published : Jul 16, 2020, 11:08 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నప్పటికీ.. రోడ్లపై జనం రద్దీ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతం జనంతో నిత్యం కిటకిటలాడుతోంది. లాక్​డౌన్ ఆంక్షలు ముగిసిన తర్వాత జిల్లాలో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి.

జిల్లాలో ఇప్పటికే కొవిడ్​ కేసుల సంఖ్య ఐదు వేలు దాటిందటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఇలాంటి సమయంలోనూ జనం బయటకు రావడం మానడం లేదు. బయటికి వచ్చినపుడు భౌతిక దూరం మర్చిపోతున్నారు. వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details