మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్డీఏ బిల్లు రద్దును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో రాజధాని రైతులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎవరి ఇళ్లలో వారే ఆందోళన చేస్తున్నారు. ఓ వైపు హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతుండగా... మళ్లీ ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు బిల్లు పెట్టడం పట్ల రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రాజధాని మహిళలు స్పష్టం చేశారు.
'అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు నిరసన కొనసాగిస్తాం' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్డీఏ బిల్లు రద్దును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో రాజధాని రైతులు చేస్తున్న నిరసన కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఎవరి ఇళ్ల దగ్గర వారే ఆందోళన చేస్తున్నారు.
'అమరావతిని రాజధానిగా కొనసాగించేదాకా నిరసన కొససాగిస్తాం'