ఇళ్ల స్థలాల కోసం స్పందనకు పోటెత్తిన ప్రజలు... - land
స్పందన కార్యక్రమానికి ప్రజలు భారీగా వస్తున్నారు. ఇళ్ల స్థాలు కోసం క్యూలైన్లలో నిల్చుని దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఉగాది నాటికి ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రజలు ఇళ్ల కోసం స్పందన కార్యక్రమానికి క్యూకడుతున్నారు.
గుంటూరు జిల్లాలో స్పందన కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.ఉగాది నాటికి అందరికీ ఇళ్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీతో జడ్పీ ప్రాంగణంలోని గ్రీవెన్స్ సెల్‌కి దరఖాస్తుదారులు వేలాదిగా తరలివచ్చారు.కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రజల నుంచి వివిధశాఖలకు సంబంధించిన వినతిపత్రాలు స్వీకరించారు.గుంటూరు నగరంలో ఏళ్ల తరబడి నివసిస్తున్నామని...తాము అద్దె ఇళ్లల్లోనే కాలం గడుపుతున్నామని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు.ఉగాది నాటికి ఇంటిస్థలాలు,ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం హామీపై ఆశతోనే స్పందన కార్యక్రమానికి వచ్చినట్లు అర్జీదారులు చెప్పారు.