ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం వచ్చారు.. మాస్కులు మాత్రం మరిచారు! - vinukonda municipal officers news

గుంటూరు జిల్లా వినుకొండ కొవిడ్ కేంద్రం వద్ద మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై... సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు మాస్కులు లేకుండా వస్తున్నప్పటికీ అధికారులు వారిని అప్రమత్తం చేయట్లేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

vaccine centre without mask
వినుకొండ వ్యాక్సిన్ సెంటర్

By

Published : Apr 14, 2021, 4:11 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ కరోనా వ్యాక్సిన్ కేంద్రంలో కొవిడ్ నిబంధనలకు అధికారులు పాతరేశారు. ప్రజలు గుంపులుగా మాస్కులు లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రం వద్దకు వస్తున్నప్పటికీ వారిని అప్రమత్తం చేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని జాషువా కళా ప్రాంగణంలో వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు.. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేస్తున్నామని చెప్పగా.. ప్రజలు భారీగా తరలి వచ్చారు. అందులో చాలామంది మాస్కులు ధరించకపోవడంపై తోటివాళ్లు ఆందోళన చెందారు.

ABOUT THE AUTHOR

...view details