ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పీఆర్సీతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ' - పీఆర్సీతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం

పీఆర్సీతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. క్వాంటం ఆఫ్ పెన్షన్లో చేసిన మార్పులతో ఒక్కొక్కరూ 7నుంచి 10వేలు నష్టపోతారని తెలిపారు. పెన్షనర్ మరణిస్తే ఇచ్చే మట్టి ఖర్చులను తగ్గించడాన్ని తప్పుపట్టారు.

Eedara Veeraiah
Eedara Veeraiah

By

Published : Jan 18, 2022, 6:53 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. క్వాంటం ఆఫ్ పెన్షన్లో చేసిన మార్పులతో ఒక్కొక్కరూ రూ.7నుంచి 10వేలు నష్టపోతారని తెలిపారు. అలాగే పెన్షనర్ మరణిస్తే ఇచ్చే మట్టి ఖర్చులు రూ.20వేలకు పరిమితం చేయటాన్ని తప్పుపట్టారు. మట్టిఖర్చులుగా ఒక నెల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేదని పెన్షనర్లకు నష్టం చేయటం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో ఉన్న 4లక్షల మంది పెన్షనర్లు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయసులో పోరాటాలు చేయలేమని.. ప్రభుత్వం దయతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఫార్సులు కాకుండా పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలన్నారు.

పీఆర్సీతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది

ABOUT THE AUTHOR

...view details