ఈనాడు కథనానికి స్పందన... తలసేమియా రోగికి పింఛన్ - తలసేమియా రోగికి పింఛను
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చేజర్ల శంకరరావుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి పింఛను సౌకర్యం కల్పించారు. 10 వేల రూపాయలు అందజేశారు.
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే గోపిరెడ్డి పింఛను అందజేశారు. చేజర్ల శంకరరావు పదమూడు సంవత్సరాలుగా తలసేమియాతో బాధపడుతున్నారు. ఈ అంశంపై గత నెలలో ఈనాడు ప్రచురించిన వరుస కథనాలతో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చర్యలు తీసుకున్నారు. బాధితుడికి ప్రతినెలా 10 వేలు అందే విధంగా ఫించన్ మంజూరు చేశారు. ఈ మేరకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు చేజర్ల శంకరరావు ఇంటికి వెళ్లి మొదటి నెల 10 వేలు నగదుతో పాటు పింఛను అర్హత పత్రాన్ని అందజేశారు.