పింఛన్ల చెల్లింపులో ఈరోజు నుంచి రాష్ట్రంలో సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా లబ్ధిదారులకు ఇంటివద్దనే పింఛన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కొన్నిచోట్ల పింఛన్ పంపిణీ మందకొడిగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని వార్డులలో వాలంటీర్లు ఒకేచోట కూర్చొని వృద్ధులకు నగదు ఇస్తున్నారు. పింఛన్ కోసం వచ్చిన కొందరు వృద్ధులను... వార్డులో పేరు లేదని వెనక్కి పంపిస్తున్నారు. ఈ విషయమై కొంతమంది వాలంటీర్లను వివరణ కోరగా.... తమకు ఇచ్చిన లిస్టులో ఉన్న పేర్లు వారికి మాత్రమే నగదు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
పిడుగురాళ్లలో మందకొడిగా పింఛన్ పంపిణీ - pension distribution latest news in piduguralla
పిడుగురాళ్లలో కొన్నిచోట్ల పింఛన్ల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇంటింటికి తిరిగి పింఛన్ ఇవ్వాల్సి ఉండగా... పట్టణంలోని కొన్ని వార్డులలో వాలంటీర్లు ఒకేచోట కూర్చొని వృద్ధులకు నగదు ఇస్తున్నారు.

పిడుగురాళ్లలో మందకొడిగా సాగుతున్న పింఛన్ పంపిణీ