ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకూ పొడిగించాలి' - latest telugu news

Pedanandipadu Farmers Hunger Strike : గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకు పొడిగించాలని రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా పెదనందిపాడులోని రైతులు నిరహార దీక్షలకు పూనుకున్నారు. దీనికి రైతు నాయకులు, పలు పార్టీలకు చెందిన నేతలు మద్దతు పలికారు.

Farmers Hunger Strike
పెదనందిపాడులో రైతుల నిరాహార దీక్షలు

By

Published : Mar 25, 2023, 10:41 PM IST

Guntur Channel : గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకూ పొడిగించాలంటూ.. పెదనందిపాడులో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరాహారదీక్షలకు రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు మద్దతు పలికారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. గుంటూరు ఛానల్ పొడిగింపుపై గతంలో సర్వే జరిగినా.. నిధుల కేటాయింపులో ప్రభుత్వం ఉదాసీనత చూపిస్తోందన్నారు. నాబార్డు నుంచి నిధులు తీసుకుని ప్రభుత్వం పనులు చేయటానికి అవకాశం ఉందని సూచించారు. ఇక్కడి ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసమైనా గుంటూరు ఛానల్ పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛను సాఫల్యం చేయటానికి ప్రయత్నించాలని అన్నారు. ఈ ప్రాంతంలో బోరుబావులు పడవని.. కొన్ని రోజులు నిల్వ ఉండే చెరువుల నీటినే వినియోగించుకోవటం చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్య పరిష్కారం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నా ప్రభుత్వాల్లో కనీస చలనం లేదని నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కొల్లా రాజమోహన్ ఆరోపించారు. భూసేకరణకు 113కోట్ల రూపాయలు అవసరమని లెక్కలు వేసి వదిలేశారే తప్ప.. ఇవ్వలేదని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజికి 40 మైళ్ల దూరంలోనే ఉన్న ప్రాంతంలో నీటికి ఇబ్బందులు రావటం దారుణమన్నారు. ఈ ప్రాంతానికి కచ్చితంగా నీటిని అందిచాలని డిమాండ్​ చేశారు. తాగటానికి పనికిరాని, చెడువాసన వచ్చే నీటిని తాగలేక, కుటుంబాలకు అందించలేక.. ఈ ప్రాంత మహిళలు దీక్షలో పాల్గొన్నారన్నారు. రైతులకు భూకేటాయింపులకు పరిహారం అందించకుండా.. రైతులను భూములు ఇవ్వమంటే ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఇటీవలి బడ్జెట్​లో దీనికోసం నిధులు కేటాయించకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పర్చూరు వరకూ పోడిగించటానికి మార్గం ఉన్నా.. చేయాలనే మనసు లేదని దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గుంటూరు ఛానల్ పొడిగింపుపై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికోసం ఖర్చు చేయటానికి నగదు.. మంత్రుల పర్యటనల కోసం వినియోగించే దానిలో సగం కూడా కాదని ఎద్దేవా చేశారు. గెజిట్​ నోటిఫికేషన్​ విడుదలైనా తర్వాత.. బడ్జెట్​లో నిధులను కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ విధంగా ప్రభుత్వం ఉందంటే.. గొప్పలు చెప్పే ముఖ్యమంత్రికి సిగ్గుగా ఉందో లేదో తెలియదు కానీ, వారికి మాత్రం సిగ్గుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రచార ఖర్చు మానేసినా.. రంగుల పిచ్చి తగ్గించుకున్నా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఎద్దేవా చేశారు.

గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకూ పొడిగించాలనిపెదనందిపాడులో రైతుల నిరాహార దీక్షలు

"మొదటి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలి. ఈ ప్రాంతంలో బోరు బావులు పడవు. కేవలం చెరువులలో ఉన్న నీటిని మాత్రమే వినియోగించుకోవాలి. ఈ పరిస్థితి రావటం చాలా బాధాకరం. ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం కలిగితే రైతులలో సంపూర్ణ మార్పు కలుగుతుంది. గతంలో సర్వేలు నిర్వహించారు. టెండర్లు కూడా పిలిచారు. ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛను సాఫల్యం చేయటానికి ప్రయత్నించాలి."- వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీమంత్రి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details