గుంటూరు జిల్లాలోనే పేరుగాంచిన పెదకాకాని మల్లేశ్వర ఆలయం 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ శ్యామల రఘునాథ్ రెడ్డి తెలిపారు. మండలంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికమవడంతో… ఇప్పటికే ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం స్వామి వార్ల దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చే నెల 10వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేసినా.. స్వామికి అర్చక స్వాములచే ఏకాంత సేవలు నిర్వహించబడతాయని శ్యామల రఘునాథ్ రెడ్డి తెలిపారు.
కొవిడ్ ఎఫెక్ట్: పెదకాకాని ఆలయం 14 రోజులు మూసివేత - Guntur latest news
కొవిడ్ రెండో దశ విజృంభిస్తుండటంతో గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని మల్లేశ్వర ఆలయం 14 రోజులపాటు మూసేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ శ్యామల రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
Pedakakani temple closed due to corona