గుంటూరు జిల్లా పెదకాకాని మేజర్ పంచాయతీ సర్పంచ్ మండె మాధవీలత కరోనాతో మృతి చెందారు. ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె తెదేపా మద్దతుతో గెలుపొందారు. జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీలో ఆమె 1200కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 20 రోజుల క్రితం ఆమె కొవిడ్ టీకా వేయించుకున్నారు. 10 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు.
పెదకాకాని మేజర్ పంచాయతీ సర్పంచ్ కరోనాతో మృతి - today Pedakakani Major Panchayat Sarpanch dead with corona news update
ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన మండె మాధవీలత కరోనాతో మృతి చెందారు. మాధవీలత మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పెదకాకాని మేజర్ పంచాయితీ సర్పంచ్ కరోనాతో మృతి
మాధవీత లత మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. మాధవీలత అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వానికి మాధవీలత మరణం తీరనిలోటన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చూడండి…:గర్భిణికి కరోనా అని చెప్పి.. ప్రసవానికి రూ.5 లక్షలు డిమాండ్