ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్త సేకరణ పన్నుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం: మస్తాన్ వలి - congress party updates

చెత్త సేకరణకు పన్ను విధించటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్​ వలి అన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

congress party protest
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్​ వలి నిరసన

By

Published : Jun 8, 2021, 6:52 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల పైన భారం మోపటం హేయమైన చర్య అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. చెత్త సేకరణకు పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ.. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం సలహాతో రాష్ట్రం... రూ.2,500 కోట్ల పన్ను భారాన్ని ప్రజల పైన మోపుతుందన్నారు.

చెత్త సేకరణ పన్ను, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మస్తాన్​ వలి అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రెండు పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం: గౌతంరెడ్డి

ABOUT THE AUTHOR

...view details