Golla Baburao: మంత్రి పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ బహిరంగంగా మాట్లాడిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకే క్యాంపు కార్యాలయానికి పిలిపించారన్న చర్చ జరిగింది. అయితే బాబూరావు సీఎంను కాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. సుమారు రెండు గంటలపాటు ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఉన్నా సీఎంను కలవలేదని సమాచారం. గురువారం ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో అక్కడే కలిసే అవకాశం ఉందని తెలిసింది.
Golla Baburao: సీఎం క్యాంపు కార్యాలయానికి గొల్ల బాబురావు.. అదే కారణమా? - సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడిన గొల్ల బాబురావు
Golla Baburao: మంత్రి పదవి విషయంలో బహిరంగంగా మాట్లాడిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటలపాటు ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఉన్నా సీఎంను కలవలేదని సమాచారం.
సీఎం క్యాంపు కార్యాలయానికి గొల్ల బాబురావు