జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, యువకులు, మత్స్యకారుల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. సామాన్యులకు రాజకీయాలను దగ్గర చేసేందుకు జనసేన పార్టీ పనిచేస్తుందని తెలిపారు. జనసేన ఎన్నికల ప్రణాళికలోని ముఖ్య అంశాలను వివరిస్తూ... ఆయన వీడియోను విడుదల చేశారు. సంక్షేమంలో అందరినీ సమానంగా చూస్తామని పవన్ అన్నారు.
'జనసేన ఎన్నికల ప్రణాళిక ప్రవేశిక' - jsp
జనసేన ఎన్నికల ప్రణాళికలోని ముఖ్య అంశాలను వివరిస్తూ... ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 'జనసేన ఎన్నికల ప్రణాళిక' ప్రవేశిక పేరుతో వీడియోను విడుదల చేశారు.
భవిష్యత్తు తరాలకోసం రాజకీయాల్లోకి వచ్చా..
ఎన్నికల మేనిఫెస్టోను వివరించిన జనసేనాని.. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మేలు చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ స్పష్టం చేశారు. తొలుత 'కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్' పెట్టానని... ఆ తర్వాత తన అన్నయ్య (చిరంజీవి) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరినట్లు వివరించారు.
రాజ్యంగ స్ఫూర్తితో పారదర్శక పాలన అందిస్తా..
ఎన్టీఆర్, ఎంజీఆర్, కాన్షీరాం వంటి నాయకుల ప్రభావం తనపై ఉందని జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అవినీతిపై నిరంతర యుద్ధం చేస్తామని ప్రకటించారు.