ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జనసేన భావజాలంతో విజయం సాధించిన వారికి అభినందనలు' - ఏపీ పంచాయతీ ఎన్నికల తాజా వార్తలు

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించిన వారికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని మలి దశ ఎన్నికలలోనూ కొనసాగించాలని సూచించారు.

pawan kalyan wishes to  sarpanches
pawan kalyan wishes to sarpanches

By

Published : Feb 10, 2021, 8:42 PM IST

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన భావజాలంతో విజయం సాధించిన వారికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జనసేన పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం సంతోషం కలిగిస్తోందన్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటం, ధన బలం లేకున్నా.. జనసైనికుల పోరాటపటిమ ఆకట్టుకుందని తెలిపారు. రాబోయే విజయాలకు ఈ ఫలితాలు సంకేతాలుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

'ఎక్కువ మంది యువత ఉరకలెత్తే ఉత్సాహంతో నామినేషన్లు వేశారు.... అప్పుడే మన ధ్యేయం సగం నెరవేరిందని అభిప్రాయపడ్డా. ఎన్నికల్లో అధికార పార్టీ ధనబలం, ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ చూస్తున్నారు... వాటిని ఎదుర్కొని నిలబడినందుకు అభినందనలు. జనసేన విజయాలను తక్కువ చేసి చూపే వారి గురించి ఆలోచించవద్దు. ఇదే స్ఫూర్తిని మలి దశ ఎన్నికల్లోనూ కొనసాగించాలి'- పవన్​ కల్యాణ్

ఎన్నికలలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు తన తరఫున, జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలను పవన్ కల్యాణ్ తెలియజేశారు.

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు ప్రజల మనోభావాలకు చెందిన అంశం'

ABOUT THE AUTHOR

...view details