జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి విజయకీలాద్రిపై ఉన్న శ్రీపెరుమాళ్ల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రిదండి చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ధనుర్మాసంలో స్వామి వారిని దర్శించుకుంటే కలిగే లాభాలను పవన్‌కు.. జీయర్ స్వామి వివరించారు. ఆలయ విశిష్టతను తెలిపారు.
పెరుమాళ్ల వెంకటేశ్వర స్వామి సేవలో జనసేన అధినేత - pawan kalyan at shri perumalla venkateswara temple
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు శ్రీపెరుమాళ్ల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
చినజీయర్ స్వామితో పవన్ కల్యాణ్