Pawan Kalyan Meeting With Youth: యువ సమూహం తన వెంట ఉంది కాబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. విభిన్న రంగాలు, ప్రాంతాల నుంచి వచ్చిన యువతతో పవన్ సమావేశమయ్యారు. దశాబ్దంగా తనతో నడుస్తున్న యువతకు కచ్చితంగా అండగా నిలుస్తానని పవన్ హామీ ఇచ్చారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 'గ్లాసు టీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వివేకానందుని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం యువతతో జనసేనాని ప్రత్యేకంగా మాట్లాడారు. వారితో కలిసి టీ తాగుతూ వారి ఆలోచనలు తెలుసుకున్నారు. తనను అన్ని విధాలా నమ్మి, లక్ష్య సాధనలో నిలబడింది యువత మాత్రమేనని అన్నారు.
పవన్ కళ్యాణ్‌ను కలిసిన పలువురు నేతలు- తాజా రాజకీయాలపై చర్చ
ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన వెంట ఉందని, వారి అండతోనే వైసీపీ వంటి నేరపూరిత ఆలోచనలు ఉన్న పార్టీతో పోరాడుతున్నానని పవన్ వివరించారు. నవతరం ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, సమాజంలో జరిగే అన్ని విషయాల మీద యువతకు ఉన్న ఆలోచనే తనకు స్పష్టం చేశారు. సమస్యల మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తానని వివరించారు.