'ఎన్నికలు పద్ధతిగా జరిగుంటే ఫలితాలు మరోలా ఉండేవి'
సార్వత్రిక ఎన్నికలు పద్ధతిగా సాగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో నేతలతో సమీక్ష నిర్వహించి జనసేనాని ఈటీవీ భారత్ తో ఎన్నికల ఫలితాలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు.
ఎన్నికలు సవ్యంగా జరిగుంటే ఫలితాలు ఇంకోలా ఉండేవని జనసేన అధినేత పవన్ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఇది ఒక ఎన్నికల కోసం మొదలుపెట్టిన ప్రయాణం కాదన్నారు పవన్. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.... జనసేన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందన్నారు. మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని.....అందుకే లక్షల ఓట్లు జనసేనకు వచ్చాయిని తెలిపారు. సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక అవగాహనకు వస్తామని స్పష్టం చేశారు.