గుంటూరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. మూడేళ్ల తరువాత తమ అభిమాన కథానాయకుడు సినిమా విడుదల కావడంతో సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, హారతులు ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమా అన్ని రంగాల వారికి నచ్చుతుందని అభిమానులు తెలిపారు.
పవన్ అభిమానుల సందడి.. పలుచోట్ల కటౌట్లకు పాలాభిషేకాలు - వకీల్ సాబ్ రిలీజ్ రోజున పవన్ అభిమానుల సందడి వార్తలు
మూడేళ్ల తరువాత తమ అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల కావడంతో.. గుంటూరు జిల్లాలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల పవన్ కటౌట్లకుపాలాభిషేకాలు చేశారు.
పవన్ అభిమానుల సందడి
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కింది. లాయర్‌గా పవన్ కళ్యాణ్ నటించారు. ఇక ఉదయం 7 గంటల నుంచే పవన్ ఫ్యాన్స్ కి గుంటూరులో స్పెషల్ షో ఏర్పాటు చేశారు. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావటం.. అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇవీ చూడండి...