ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యపాన నిషేధం జగన్​తో సాధ్యం కాదు: పవన్

మద్యపాన నిషేధం ముఖ్యమంత్రి జగన్​తో సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మద్యపాన నిషేధం జగన్​తో సాధ్యం కాదు: పవన్

By

Published : Jul 31, 2019, 3:54 PM IST

మద్యపాన నిషేధం జగన్​తో సాధ్యం కాదు: పవన్

గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో రాజమహేంద్రవరం నేతలు, కార్యకర్తలతో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్...సార్వత్రిక ఎన్నికల్లో ఏ పొరపాట్లు జరిగాయో వాటిని గుర్తించి సరిచేసుకోవాలన్నారు. సమర్థత లేని నాయకుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని పవన్ అన్నారు. తిత్లీ తుపాను సమయంలో ఆ ప్రాంతంలోనే పర్యటించిన జగన్ ఎవర్ని పరామర్శించలేదన్నారు. జగన్ మద్యపాన నిషేధం హామీ అమలు చేయలేరన్న పవన్‌...మహిళలు ఆందోళన చేసేచోట్ల మద్యం దుకాణాలు ఎత్తివేయాలన్నారు. పింఛను ఏటా రూ.250 పెంచుతామని ముందే చెప్పాల్సిందని అభిప్రాయపడ్డారు. అమలుచేయలేని హామీలు ఇవ్వడం ఎందుకని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. అసెంబ్లీలో నాయకులు కొట్టుకోవడం ఒక్కటే తక్కువని విమర్శించారు. ఏదో ఒకరోజు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తానని పవన్‌ స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details